HomeTelugu Trendingఆ క్లాస్‌ డైరెక్టర్‌తో మరోసారి హీరోగా ప్రియదర్శి!

ఆ క్లాస్‌ డైరెక్టర్‌తో మరోసారి హీరోగా ప్రియదర్శి!

Priyadarshi movie with Indr

టాలీవుడ్‌ నటుడు ప్రియదర్శి కామెడీ టైమింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రెండ్స్‌ క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపిస్తూ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాడు. మల్లేశం సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టిన ప్రియదర్శి ఆ తర్వాత బలగం సినిమాతో సూపర్ బ్రేక్ అందుకున్నాడు.

ఓ వైపు క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తూనే.. మరోవైపు సోలో హీరోగా కూడా రాణిస్తున్నాడు. తాజాగా ప్రియదర్శి కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రియదర్శి కోసం క్లాస్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ ఓ కథను రెడీ చేశాడట.

స్క్రిప్ట్‌ ప్రియదర్శిని కూడా ఇంప్రెస్ చేసినట్టు టాక్‌. మిస్టర్‌ ప్రెగ్నెంట్ ఫేం రూపా కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్‌ 2024 మార్చి నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తోండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu