
తెలుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌కి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 6 సీజన్‌లు పూర్తి చేసుకోగా.. 6 సీజన్‌లకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా హోస్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సారి హోస్ట్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణని తీసుకోవాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టుగా సమాచారం. మొన్నటి వరకు సినిమాలకే పరిమితమైన బాలకృష్ణ ఆహాలో ప్రచారం అవుతున్న ‘అన్ స్టాపబుల్’ కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. ఆ షోను నెంబర్ వన్‌గా నిలబెట్టారు. హోస్టుగా గా కూడా బాలకృష్ణ తానేమిటనేది నిరూపించుకున్నారు.
ప్రస్తుతం బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తనదైన స్టైల్లో బాలయ్య ఈ టాక్ షోను రక్తి కట్టిస్తున్నారు. అందువలన ‘బిగ్ బాస్ సీజన్ 7’ కి హోస్టుగా ఆయనను తీసుకోవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.












