HomeTelugu Big Storiesసుమంత్‌ రెండో వివాహం.. శుభలేఖ వైరల్‌

సుమంత్‌ రెండో వివాహం.. శుభలేఖ వైరల్‌

Hero sumanth Wedding card v

టాలీవుడ్‌ హీరో సుమంత్ రెండో వివాహం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర.. వివాహానికి ఇదే మా ఆహ్వానం.. అంటూ శుభలేఖను ముద్రించారు. త్వరలోనే ఈ వివాహం జగరనుంది. ఇప్పటికే ఇరువైపులా కార్డ్స్ పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివాహ కార్డులను SP (సుమంత్-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దారు. ప్రస్తుతం కరోనా కారణంగా కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఉంటుందని అంటున్నారు.

2004 లో నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు సుమంత్‌. కానీ వారు రెండు సంవత్సరాల తరువాత విడాకులకు తీసుకున్నారు. కీర్తి ఆ తర్వాత వేరే వివాహం చేసుకుని సెటిలయ్యారు. అయితే ఇన్నాళ్లు సుమంత్ మరో పెళ్లి చేసుకోలేదు. తాజాగా రెండో వివాహానికి సిద్ధమవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu