HomeTelugu Big Storiesబాలకృష్ణ క్లాసిక్ మూవీ రీరిలీజ్

బాలకృష్ణ క్లాసిక్ మూవీ రీరిలీజ్

balakrishna evergreen movieనందమూరి బాలకృష్ణ నటించిన ‘భైరవద్వీపం’ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు 30 ఏళ్లు పూర్తికావస్తుంది. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నారు.

క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై చంద్రశేఖర్ కుమారస్వామి, పి. దేవ్ వర్మ ‘భైరవద్వీపం’ సినిమాను 4K క్వాలిటీలోకి అప్‌గ్రేడ్ చేసి ఆగస్టు 5న మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రోజా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. దివంగత నటుడు, రచయిత రావి కొండలరావు ఈ సినిమాకు కథ అందించగా.. సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించారు. చందమామ విజయా కంబైన్స్ బ్యానర్‌పై బి.వెంకట్రామిరెడ్డి నిర్మించారు. కైకాల సత్యనారాయణ, సంగీత, విజయకుమార్, కె.ఆర్.విజయ, రంభ, శుభలేఖ సుధాకర్, గిరిబాబు, బాబూ మోహన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు.

balakrishna 1

ఈ చిత్రం ద్వారా విజయ రంగరాజు విలన్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. మాదవపెద్ది సురేష్ సంగీతం సమకూర్చారు. అప్పట్లో ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్. అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏకంగా 9 నంది అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాలో మాంత్రికుడు కనిపించినప్పుడల్లా నేపథ్య సంగీతంలో వచ్చే ‘కవచ కవచ’ అనే సౌండ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిందట. ఇప్పుడు అదే సౌండ్‌ను మరోసారి థియేటర్లలో డాల్బీ టెక్నాలజీతో వినొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!