చిరు 151 మొదలైంది!

‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 151వ సినిమాను మొదలుపెట్టేశారు. మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో జరిగాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ కార్యాలయంలో చిరంజీవి, సురేఖ, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఆగస్ట్ 22న ‘ఉయ్యలవాడ’ చిత్రాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.

ఈ కార్యక్రమంలో రచయితలు పరుచూరి బ్రదర్స్, అల్లు అరవింద్ పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ హిందీ భాషల్లో
కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కానుకగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.