బాలయ్య, కృష్ణవంశీల సినిమా డౌటే!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బాలయ్య, కృష్ణవంశీల కాంబినేషన్ లో ‘రైతు’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే.. హీరో గారికి, డైరెక్టర్ గారికి మధ్య విబేధాలు వచ్చినట్లు సమాచారం.

కథ, కథనం, పాత్రల ఎంపిక ఇలా చాలా విషయాల్లో బాలయ్యకు, కృష్ణవంశీకు బొత్తిగా పడట్లేదని.. వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయిందని అంటున్నారు. కృష్ణవంశీ తీరు నచ్చకపోవడంతో బాలయ్య తనకు వార్నింగ్ ఇచ్చాడని, పరిస్థితి మారకపోతే సినిమా ఆపేద్దామని చెప్పినట్లు టాక్.

అసలు విషయంలోకి వస్తే ఈ సినిమాలో అమితాబ్ ను సంప్రదించిన సంగతి తెలిసిందే. అమితాబ్ కోసం కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం బాలయ్యకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఓ పాత్ర కోసం కథలో ఇలా మార్పులు చేస్తే కథలో ఫ్లేవర్ మిస్ అవుతుందని బాలయ్య భావిస్తున్నాడు.

ఒకసారి బాలయ్య గనుక ఆలోచనలో పడితే ఈ సినిమా పరిస్థితి రిస్క్ లో పడినట్లే.. మరి బాలయ్య చెప్పినట్లే కృష్ణవంశీ చేస్తాడా..? లేక కథను రిస్క్ లో పడేస్తాడో.. చూడాలి!