HomeTelugu Trendingన్యూలుక్‌తో బాలయ్య అదరగొట్టాడు

న్యూలుక్‌తో బాలయ్య అదరగొట్టాడు

11 18
నందమూరి బాలకృష్ణ ..తన సినిమాల్లోని పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకోవడంలో ఏ మాత్రం వెనకాడడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. నందమూరి అభిమానులను దృష్టిలో ఉంచుకుని బాలయ్య పాత్రను డిఫరెంట్‌గా డిజైన్‌ చేశాడట బోయపాటి. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ‘ఆఘోర’ క్యారెక్టర్‌లో బాలయ్య కనిపించనున్నాడని టాలీవుడ్‌ టాక్‌.

ఈ చిత్ర షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ వారణాసిలో ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా అక్కడ నుంచి తిరిగొచ్చారు. అయితే ఈ మధ్య ఓ కార్యక్రమంలో బాలయ్య డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. చిన్నపాటి జుట్టు, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. బోయపాటి సినిమాల్లో ఆయన లుక్‌ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అప్పట్లో గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు బాలయ్య. అంజలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu