ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 ‘మహానాయకుడు’ సినిమా కలెక్షన్లు చూసి ఇప్పుడు అంతా ఇదే అనుకుంటున్నారు. అసలు ఎన్టీఆర్ అంటే ఎలా ఉండేవాడు.. ఇప్పుడు తన కుటుంబ సభ్యులే ఎన్టీఆర్ పరువు తీస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. అందులో నిజం కూడా లేకపోలేదు. ఈ సినిమాకు కలలో కూడా ఊహించని పరాభవం ఎదురైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. ఈ మూవీ వచ్చిన తొలిరోజు కలెక్షన్లు చూసిన తర్వాత బయ్యర్లు ఏడవటం తప్ప మరోటి చేయలేకపోతున్నారు.
కనీసం రెండు కోట్లు కూడా తీసుకురాకపోవడం పక్కనబెడితే థియేటర్ రెంట్లు కూడా రాబట్టలేకపోయిందంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఈ చిత్రం తొలిరోజు ఏపీ తెలంగాణల్లో కేవలం కోటి 50 లక్షలు మాత్రమే షేర్ వసూలు చేసింది. అసలు ఇది నిజంగానే బాలయ్య సినిమానేనా అనే అనుమానం వచ్చేలా ఈ చిత్రం కలెక్షన్లు వస్తున్నాయి. రెండో రోజు మరింత దారుణంగా మారిపోయింది పరిస్థితి. ఓవర్సీస్ కలెక్షన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో..? అక్కడ మహానాయకుడు మాత్రం కేవలం లక్ష డాలర్లతో సరిపెట్టుకుంది.
దాన్నిబట్టే సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నాగార్జున ఆఫీసర్ సినిమాకు మాత్రమే ఇంత దారుణమైన రికార్డ్ ఉండేది. ఎలా చూసుకున్నా కూడా ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించి అనవసరంగా పాడు చేసారంటూ ఇప్పుడు విమర్శలొస్తున్నాయి. ఎన్టీఆర్ జీవితంలో సినిమాగా చేయాలంటే చరమాంకం ఒక్కటే కరెక్ట్ అని వర్మ చెప్పాడు.. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం అనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా ఎన్టీఆర్ బయోపిక్ ఓ చారిత్రాత్మక తప్పిదంలా మారిపోయింది. బాలయ్య తనకు తెలియకుండానే సరిదిద్దుకోలేని తప్పు చేసాడు.












