పవన్ కంటే ముందే బాలయ్య!

సార్వత్రిక ఎన్నికలు మొదలు అయ్యేలోగా పవన్ కళ్యాణ్ నుంచి ఒక పొలిటికల్ సినిమా రాబోతోంది అనీ అది త్రివిక్రమ్ సినిమా అయిన తరవాత ఒక మూడు నెలలకి మొదలు అవుతుందని తెలుస్తోంది. పవన్ కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ ఒక భారీ పొలిటికల్ డ్రామాని సిద్దం చేస్తున్నారని సమాచారం. తన తండ్రి ఎన్టీఆర్ మీద బయోపిక్ కి బాలయ్య సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే కానీ దానికంటే ముందరే బాలయ్య జై సింహ
తో పొలిటికల్ టార్గెట్ చేస్తున్నారు అని తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ విగ్రహం దాని చుట్టూ ప్రజల ఆందోళనలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి సినిమాలో
పొలిటికల్ డ్రామా ఉండబోతుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.