బాలయ్య సినిమాకు రీషూట్స్..?

బాలకృష్ణ వందవ చిత్రంగా రూపొందుతోన్న ‘గౌతమీపుత్రశాతకర్ణి’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా
రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
అసలు విషయంలోకి వస్తే ఇటీవలే ఈ సినిమా జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకొని, మధ్యప్రదేశ్
లో మరో షెడ్యూల్ లో పాల్గొంది. అరవై శాతం షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ లో జరగబోయే
షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అయితే ఉన్నట్టుండి చిత్రబృందం మళ్ళీ జార్జియాకు
ప్రయాణమవుతుంది. జార్జియాలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను, యుద్ధ సన్నివేశాలను
చిత్రీకరించారు. రీసెంట్ గా ఆ ఫూటేజ్ చూసిన బాలయ్య అసంతృప్తి చెందాడట. ఇక వేరే దారి లేక
చిత్రబృందం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయడానికి జార్జియా వెళ్లబోతుంది. ఇలా సినిమా రీషూట్స్
చేసుకుంటూ పోతే చెప్పిన టైమ్ కు రిలీజ్ అవుతుందా.. అని అభిమానుల్లో ఆందోళనా కలుగుతుంది.
మరి బాలయ్య బాబు సంక్రాంతి బరిలోకి నిలుస్తారో లేదో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates