డెబ్బై ఏళ్ళ ముసలివాడిగా బాలయ్య!

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల
ముందుకు రానుంది. దీని తరువాత బాలకృష్ణ, కృష్ణవంశీ డైరెక్షన్ లో ‘రైతు’ అనే సినిమాలో
నటించనున్నాడు. ఈ సినిమా బాలయ్యతో పాటు అమితాబ్ కూడా కనిపించనున్నాడని
చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై
కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. టైటిల్ కు తగ్గట్లుగానే ఆయన రైతు పాత్రలో కనిపించనున్నాడు.
అయితే అది ఓ ముసలి రైతు పాత్రట. 70 ఏళ్ళ ముసలివాడిగా బాలకృష్ణ ప్రేక్షకులను అలరించడానికి
సిద్ధమవుతున్నాడు. గతంలో కూడా ఆయన చాలా సినిమాల్లో ఓల్డ్ గెటప్పులో కనిపించాడు.
కానీ అందులో ఖచ్చితంగా యంగ్ బాలయ్య రోల్ కూడా ఉండేది. ఇప్పుడు సినిమా మొదలయినప్పటి
నుండి చివరి వరకు 70 ఏళ్ళ ముసలి వ్యక్తిగానే కనిపించనున్నారు. ఇది ఓ రకంగా ప్రయోగమనే
చెప్పాలి. మరి బాలయ్య ఫ్యాన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో…చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates