HomeTelugu Trendingఐసీయూలో బండ్ల గణేష్‌!

ఐసీయూలో బండ్ల గణేష్‌!

Bandla ganesh hospitalized

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌కి గురయ్యారు. తాజాగా టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ కు రెండోసారి బారిన పడినట్లుగా తెలుస్తోంది. బండ్ల గణేష్ కు మరోసారి కరోనా పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ కావటంతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మాత్రం టాలీవుడ్ నుంచి గాని, ఆయన ఫ్యామిలీ నుంచి ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇప్పటికే హీరో పవన్ కళ్యాణ్ కూడా ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!