‘బంగార్రాజు’ ట్రైలర్‌

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. సంక్రాంతి అంటే.. ముగ్గులు, సందళ్ళు, పేకాటలు, కొత్త అల్లుళ్ళు అన్నట్లుగా అన్ని ఈ ట్రైలర్ లో దించేశారు మేకర్స్.. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటోంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. బంగార్రాజు నరకంలో కూడా అమ్మాయిలతో సరసాలు ఆడుతూ కనిపిస్తాడు. ఇక అచ్చు గుద్దినట్లు తాత బుద్దులతో పుట్టిన చిన బంగార్రాజు కూడా ఊర్లో ఏ అమ్మాయిని వదలకుండా సరసాలు ఆడుతూ కనిపిస్తాడు. ఈసారి రమ్యకృష్ణ కూడా ఆత్మగా కనిపించింది. మనవడికి వచ్చిన సమస్య ఏంటి.. ఆ సమస్యకు ఆ ఊరి దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి.. ఆ లయకారుడు ఆజ్ఞ ఎలా ఉంది..? చివరికి చిన బంగార్రాజు లైఫ్ ని బంగార్రాజు సెట్ చేశాడా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నాగలక్ష్మిగా కృతి శెట్టి ఆకట్టుకొంది. ట్రైలర్ కి అనూప్ సంగీతం హైలైట్ గా నిలిచింది.

CLICK HERE!! For the aha Latest Updates