HomeTelugu Trendingబంగార్రాజు: 'నాకోసం' సాంగ్‌ టీజర్

బంగార్రాజు: ‘నాకోసం’ సాంగ్‌ టీజర్

Naa Kosam Lyrical Song Teas

అక్కినేని నాగ చైత‌న్య ప్రస్తుతం ‘బంగార్రాజు’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. ఇటీవ‌ల చైతూకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాగా,ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. సంక్రాంతికి చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావిస్తుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా పెంచుతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాంగ్ టీజర్ ని విడుద‌ల చేశారు. ఇందులో కృతి శెట్టి, నాగ చైత‌న్య మ‌ధ్య సాంగ్ సాగిన‌ట్టు తెలుస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకి సంబంధించిన ఫుల్ వ‌ర్షెన్‌ను డిసెంబ‌ర్ 5 సాయంత్రం 5.12ని.ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. తొలిసారి చైతూ-కృతి జోడిగా నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

బంగార్రాజు విషయానికొస్తే.. ఒకే సినిమాలో తండ్రీ కొడుకులు టైటిల్ రోల్ పోషించడం విశేషం. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu