జగన్‌ మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడు.. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

కార్యకర్తలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. నిన్నంతా హైదరాబాద్‌లోనే జగన్ ఉన్నాడంటే మరో కుట్రకు పన్నాగం పన్నుతున్నాడని గ్రహించాలని పార్టీ ముఖ్య నాయకులు, ఆ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. నేరస్థుల పార్టీని ఎక్కడా నమ్మటానికి వీల్లేదని తేల్చిచెప్పారు.

పింఛన్‌ డబ్బులు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లోనే పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ, రుణమాఫీ డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతాయన్నారు. అన్నదాతా సుఖీభవ కింద ఇప్పటికే వెయ్యి రూపాయలు జమయ్యాయని, మరో రూ.3 వేలు కూడా జమవుతున్నాయని పేర్కొన్నారు. చెక్కులు చెల్లవని ప్రచారం చేస్తున్న వారికిది చెంపచెట్టు కావాలన్నారు. లబ్ధిదారుల సంక్షేమానికి అడ్డుకునేందుకు ఎంతటి కుట్రలకైనా వైసీపీ తెగపడుతుందని విమర్శించారు.

ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వం వల్ల లాభం జరిగిందా? అంటే.. ప్రజలు చేతులెత్తి జైకొట్టే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం చెప్పారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates