HomeTelugu Trendingవర్మ డ్రీమ్‌ నేరవేర్చనున్న శిష్యుడు.. బ్యూటీఫుల్‌ ట్రైలర్‌

వర్మ డ్రీమ్‌ నేరవేర్చనున్న శిష్యుడు.. బ్యూటీఫుల్‌ ట్రైలర్‌

2 8సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రంగీలా మూవీ అప్పట్లో బాలీవుడ్ లో ఓ సంచలన విజయం సాధించింది. అందాన్ని మరింత అందంగా చూపించడంలో వర్మ సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ మూవీ విజయం తరువాత ఊర్మిళకు రంగీలాగా పేరు వచ్చింది. వర్మ మరలా అలాంటి సినిమా తీయలేకపోయారు. రంగీలా లాంటి సినిమా తీయాలని వర్మకు ఓ డ్రీమ్ ఉన్నా దాన్ని తెరపై ప్రజెంట్ చేయలేపోయాడు. కారణం ఉంది. అలాంటి సినిమా తీయాలని అనుకున్నప్పుడు అదే సినిమా గుర్తుకు వస్తుంది. మరో సినిమా తీయలేకపోయాడు.

ఇన్నాళ్లకు తన శిష్యుడు అగస్త్యా మంజు వర్మ డ్రీమ్ ను ఫుల్ ఫీల్ చేయబోతున్నాడు. అగస్త్యా దర్శకత్వంలో బ్యూటిఫుల్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీని వర్మ డ్రీమ్ గా చెప్తున్నారు. మూవీ ట్రైలర్ ను వర్మ రిలీజ్ చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా దీన్ని విడుదల చేశారు. మూడు నిమిషాల ట్రైలర్ మొత్తం నైనా గంగూలీని బ్యూటిఫుల్ గా చూపించడానికి కేటాయించారు. అందాన్ని వివిధ కోణాల్లో, వివిధ యాంగిల్స్ లో ఎలా చూపించవచ్చో అలా చూపించారు. దర్శకుడు అగస్త్య స్వతహాగా ఫోటోగ్రాఫర్ కూడా కావడంతో ప్రతి ఫ్రేమ్ సినిమాకు తగ్గట్టుగా బ్యూటిఫుల్ గా ఉండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!