చిరంజీవి టైటిల్‌తో బెల్లంకొండ

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో రాక్షసుడు ఒకటి. అండమాన్ నికోబర్ దీవుల్లో ఖైదీగా ఉన్న మెగాస్టార్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది కథ. అప్పట్లో ఈ సినిమా బంపర్ హిట్.

ఇప్పుడు ఈ టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టైన రట్ససన్ సినిమాకు ఇది రీమేక్. స్కూల్ కు వెళ్తున్న ఆడపిల్లలను ఎత్తుకెళ్ళి హత్య చేస్తున్న ఓ అజ్ఞాత హంతకుడిని వెతికిపట్టుకునే పోలీస్ ఆఫీసర్ కథగా ఈ సినిమా తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఉగాది రోజున ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారన్ని విడుదల చేయబోతున్నారట.

CLICK HERE!! For the aha Latest Updates