HomeTelugu Trendingబాలీవుడ్‌ డెబ్యూ కోసం హిందీ నేర్చుకుంటున్న బెల్లంకొండ!

బాలీవుడ్‌ డెబ్యూ కోసం హిందీ నేర్చుకుంటున్న బెల్లంకొండ!

Bellamkonda sreenivas takin

టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. వీవీ వినాయక్‌ డైరెక్షన్‌లో పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ ఈ రీమేక్‌ని నిర్మిస్తున్నారు. 2005లో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సేమ్‌ రిజల్ట్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్‌ చేయాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఓ రెంజ్‌ శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ మూవీ షూటింగ్‌ జూలై రెండో వారంలో ప్రారంభంకానుంది. అయితే లాక్‌డౌన్‌ సమయాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ కోసం మరింత కృషి చేశాడు.

సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని నిర్ణయించుకున్న బెల్లంకొండ ఇందుకోసం ఇంట్లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్‌ విషయం స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో తన వాయిస్‌కు తనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్‌ హిందీ కోచ్‌ ఇంతియాజ్‌ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారట. బెల్లంకొండ శ్రీనివాస్ తన బాలీవుడ్ డెబ్యూ కోసం బాగా కష్టపడుతున్నాడని అర్థం అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!