HomeTelugu Newsఎన్‌ఆర్‌ఐలకు కేంద్ర బడ్జెట్‌లో వెసులుబాటులు

ఎన్‌ఆర్‌ఐలకు కేంద్ర బడ్జెట్‌లో వెసులుబాటులు

11 4

ఉద్యోగం, వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాల్లో ఉంటున్న ప్రవాసులకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాటులు కల్పించింది. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐల నుంచి పెట్టుబడులను పెంచే లక్ష్యంతో బడ్జెట్‌లో కీలక అడుగు వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడులకు సంబంధించి ముఖ్య ప్రతిపాదనలు చేశారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లేదా ఇతర రూపాల్లో విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) దేశంలో సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చు. వీరికి అనేక వెసులుబాటులు ఉంటాయి. వీరు తమ పెట్టుబడులను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా వీరు కోరిన విధంగా డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తాజాగా ఇవే నిబంధనలను
ప్రవాసులకు వర్తింపజేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు పెట్టే పెట్టుబడులను విదేశీ పోర్టుఫోలియోగానే గుర్తిస్తామన్నారు.

ప్రస్తుతం ఇండియన్ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని ప్రోత్సహించేందుకు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ల దారిలోనే ఎన్‌ఆర్‌ఐలు పెట్టుబడులను పెట్టేందుకు వీలు కల్పిస్తున్నామని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇండియా పాస్‌పోర్ట్‌ కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులను జారీ చేయనున్నారు. గతంలో ఇందుకోసం 180 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. అంటే, ఒక వ్యక్తి 12 నెలల కాలంలో 182 అంతకన్నా ఎక్కువ రోజులు భారత్‌లో ఉన్నవారికి మాత్రమే ఆధార్‌ లభించేది. ఇక నుంచి దీనికి స్వస్తి పలికారు. భారత పాస్‌పోర్ట్‌ ఉంటే చాలు.. ఆ వ్యక్తి ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu