రీఎంట్రీలో ఇరగదీసిన ఇలియానా

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ” మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌. ఆరేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతో టాలీవుడ్‌లో రీ–ఎంట్రీ ఇస్తోంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్‌తో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 16న విడుదల అవుతోంది.

దీపావళి సందర్భంగా “డాన్‌ బాస్కో” అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చాలా రోజుల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన ఇలియానా తనదైన అందాలతో అలరించింది.”ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు” చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం “అమర్‌ అక్బర్‌ ఆంటొని”. ఈ నెల 10నహైదరాబాద్‌లో “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ” ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. ఇటీవల విడుదల చేసిన సినిమా టీజర్‌, మొదటి పాటకు మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా రెండో పాటను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం తమన్‌.