HomeTelugu Trendingత్వరలో తెలుగింటి అల్లుడి కాబోతున్నాను: విష్ణు విశాల్‌

త్వరలో తెలుగింటి అల్లుడి కాబోతున్నాను: విష్ణు విశాల్‌

Hero Vishnu vishal announce
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం. ఈ క్రమంలో త్వరలోనే తాను తెలుగింటి అల్లుడిని కాబోతున్నట్లు విష్ణు విశాల్‌ ప్రకటించాడు‌. రానా హీరోగా నటిస్తున్న సినిమా అరణ్య. ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. ‘‘మూడు భాషల్లో నటిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జ్వాలా ఎంకరేజ్‌మెంట్‌, మద్దతుతో నేను ధైర్యం చేయగలిగాను. అతి త్వరలోనే మేం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం. తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా పెళ్లి తేదిని ప్రకటిస్తాం’’ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu