అమితాబ్ తన భార్య వేర్వేరుగా ఉంటున్నారా..?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన భార్య జయాబచ్చన్ వేరు వేరుగా ఉంటున్నారా..? అంటే అవుననే అంటున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది వేరే ఎవరో అయితే కేవలం వార్తాలుగా మిగిలిపోయేవి కానీ బచ్చన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అమర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, అతడి భార్య జయా బచ్చన్ లు విడివిడిగా బ్రతుకుతున్నారనేది ఆ వార్తల సారాంశం.

ఒకరు ప్రతీక్షలో.. మరొకరు జానక్ లో నివాసముంటున్నారని అమర్ సింగ్ చెప్పడంతో బచ్చన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే ఐశ్వర్య కారణంగా కుటుంబాలో విబేధాలు వచ్చాయనే వార్తలు వినిపించాయి. వాటికి ఫుల్ స్టాప్ పడిందో.. లేదో.. అప్పుడే మరో వార్త వెలుగులోకి వచ్చింది. అయినా.. ఈ వయసులో అమితాబ్, జయాలు విడిగా బ్రతకడం ఏంటి..? అమర్ సింగ్ కావాలని ఇలాంటి వ్యాఖ్యలు
చేశారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.