HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

బిగ్‌బాస్‌: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

15 7

బిగ్‌బాస్‌ మొదటి నామినేషన్‌లో ప్రక్రియలో ఎంపికైన కంటెస్టెంట్‌ రాహుల్‌కు.. నామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు మొదట అవకాశం వచ్చింది. ఫస్ట్‌బెల్‌ మోగగానే.. శివజ్యోతి(తీన్మార్‌ సావిత్రి)ని తనకు బదులుగా రీప్లేస్‌ చేయాలనుకుంటున్నాని రాహుల్‌ తెలిపాడు. అయితే దానికి గల కారణాలు సరైనవి కావంటూ మళ్లీ రాహుల్‌నే నామినేట్‌ చేసింది హేమ. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఆ ముగ్గురు చర్చించుకుని నామినేట్‌ చేశారని, వాళ్లకిచ్చిన టాస్క్‌ను వారు న్యాయంగా చేశారని అందుకోసం శివజ్యోతిని సేవ్‌ చేసి రాహుల్‌నే మళ్లీ నామినేట్‌ చేయాల్సిందిగా బిగ్‌బాస్‌ను కోరింది.

రెండో బెల్‌ మెగాక వరుణ్‌ సందేశ్‌ వచ్చి.. పునర్నవిని నామినేట్‌ చేస్తున్నట్లు తెలిపాడు. ఆమె కొంచెం ఒంటరిగా ఉంటుందని, పనుల్లో కూడా సరిగా పాల్గోనడం లేదని, ఏదో తన ప్రపంచంలో తాను ఉంటోందని కారణాలను వివరించాడు. తాను అందరితో కలుస్తున్నానని, పనులు కూడా చేస్తున్నాని పునర్నవి వివరంచినా.. హేమ మాత్రం వరుణ్‌ సందేశ్‌ను సేవ్‌ చేసి, పునర్నవిని నామినేట్‌ చేసింది. మూడో బెల్‌కు వితికా షెరు వచ్చి.. అషూ రెడ్డిని తనకు బదులు రీప్లేస్‌ చేయాలనుకుంటున్నాని తెలిపింది. తను అందరితో సరిగా కలవడం లేదని, కొంచెం వేరుగా ఉంటుందని కారణాలను వివరించింది. అయితే తాను అంత తొందరగా కలవలేనని, అయినా అన్ని పనులను చేస్తున్నానని అందరితో కలవడానికి కాస్త సమయం పడుతుందని, తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలని అనుకుంటున్నానని అషూ వివరించింది. అయితే అషూ రెడ్డి ఇచ్చిన వివరణ సరిగా ఉందని ఆమెను సేవ్‌ చేసి వితికా షెరునే నామినేట్‌చేసింది హేమ.

నాల్గో బెల్‌ మోగాక వచ్చిన శ్రీముఖి.. తనకు బదులుగా హిమజను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని తెలిపారు. తనకు ఒక రెడ్‌ మార్క్‌ ఉందని, మానిటర్‌(హేమ) వేసిన ఆ రెడ్‌ మార్క్‌ వల్లే తనను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని తెలిపింది. ఉదయాన్నే తాను పని హేమకు చెప్పిందని, తనతో కలసి సినిమాను కూడా చేశానని, తన గురించి తెలుసని హిమజ తన లైఫ్‌లో అన్నీ లైట్‌గా తీసుకుంటుందని శ్రీముఖి వివరించింది. తన గురించి శ్రీముఖికి ఏం తెలుసని అన్నీ లైట్‌గా తీసుకుంటానని చెప్పిందంటూ కన్నీరు పెట్టుకుంది. శ్రీముఖికి తాను కెరీర్‌పరంగానే తెలుసని, వ్యక్తిగతంగా తన గురించి ఆమెకు ఏం తెలుసని ప్రశ్నించింది. తానేదీ లైట్‌గా తీసుకోనని.. అందుకే తనపై ఉన్న రెడ్‌ మార్క్‌ను తొలగించుకునేందుకు ఉదయాన్నే లేచి పని చేశానని, ఆ సమయానికి ఎవరూ నిద్రలేవలేదని.. ఆ విషయం వేరే ఎవరూ చెప్పలేరని, అందుకే తానే హేమతో చెప్పానని, ఆ విషయంలో తప్పేముందంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యవహారంలో హేమ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. హిమజను నామినేట్‌ చేసి శ్రీముఖిని సేవ్‌ చేసింది.

చివరగా జాఫర్‌.. తనకు బదులుగా మహేష్‌ విట్టాను రీప్లేస్‌ చేయాలనుకుంటున్నానని, ఆయన కంటే తాను బెటర్‌ పర్ఫామెన్స్‌ ఇస్తాననే కారణాన్ని తెలిపాడు. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటే ఫిజికట్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటానని, అందరితో బాగుంటానని ఇలా తన కారణాలను మహేష్‌ వివరించుకున్నాడు. అయితే ఈ విషయంలో జాఫర్‌ను నామినేట్‌ చేస్తూ.. మహేష్‌ను సేవ్‌ చేసింది హేమ. ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండగా.. ఐదుసార్లు మాత్రమే బెల్‌ మోగుతుందని బిగబాస్‌ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో బాబా భాస్కర్‌కు అవకాశం రాక మిగిలిపోయాడు. అయితే బిగ్‌బాస్‌ అతనికి కూడా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. మానిటర్‌(హేమ)- బాబా భాస్కర్‌ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సేవ్‌చేసి, మరొకరిని నామినేట్‌ చేయాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఆదేశించాడు. అయితే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరి పేరును తెలపాలని సూచించాడు. అయితే వారంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చి.. బాబా భాస్కర్‌ను సేవ్‌ చేసి, హేమను నామినేట్‌ చేశారు. సో.. మొత్తంగా ఈ వారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్‌, హేమ నామినేట్‌ కాగా.. వీరందరిలో ఎవరోకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu