HomeTelugu Trendingకెప్టెన్‌ టాస్క్‌.. నిప్పుల కుంప‌టి మీద‌ నిలబెట్టిన బిగ్‌బాస్‌

కెప్టెన్‌ టాస్క్‌.. నిప్పుల కుంప‌టి మీద‌ నిలబెట్టిన బిగ్‌బాస్‌

captaincy task
ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా అవినాష్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో భాగంగా బీబీ హోట‌ల్ సిబ్బంది గెల‌వ‌కుండా అడ్డుప‌డ్డాడు. అందుకోసం సిబ్బందికి, అతిథుల‌కు మ‌ధ్య చిచ్చు పెట్టి నార‌దుడిలా మారిపోయాడు. చివ‌రాఖ‌ర‌కు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేసే అవకాశాన్ని ద‌క్కించుకున్నాడు. అఖిల్‌, సోహైల్ కూడా కెప్టెన్సీకి పోటీ ప‌డుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్ర‌కారం అవినాష్‌, సోహైల్‌, అఖిల్ ముగ్గురూ నిప్పులు కుంప‌టి ముందు నిల్చున్నారు. రెండు చేతుల్లో ఐస్ గ‌డ్డ‌ల‌ను ప‌ట్టుకున్నారు. కింద నిప్పుల కొలిమి నుంచి వ‌చ్చే వేడిని త‌ట్టుకుంటూనే.. ఐస్‌గ‌డ్డల‌ను కింద ప‌డిపోకుండా చూసుకుంటున్నారు. అలా ఎవ‌రు ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా నిల‌బ‌డితే వారే కెప్టెన్.

అయితే ఆ వేడి సెగ‌ల‌ను త‌ట్టుకోలేని అఖిల్ కింద ప‌డిపోయాడు. దీంతో మోనాల్ తెగ కంగారుప‌డిపోయింది. అయితే ముందుగా అనుకున్నట్లుగానే ఈవారం సోహైల్ కెప్టెన్ అవుతాడ‌ని అనిపిస్తోంది. మరి ఏమౌతుందో నేటి ఎపిసోడ్‌లో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu