HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-5 తొలి కంటెస్టెంట్‌ పేరు ఖరారు!

బిగ్‌బాస్‌-5 తొలి కంటెస్టెంట్‌ పేరు ఖరారు!

Bigg boss 5 telugu first co
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌. ఈ షోకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లోనూ ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. తెలుగులోనూ ఈ షోకి మంచి ఆదరణ ఉంది. తెలుగులో ఇప్పటికే 4 సీజన్‌లు పూర్తిచేసుకున్న ఈ షోపై పలు విమర్శలు వచ్చినప్పటికీ.. రేటింగ్‌లో దూసుకుపోతుంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చిన బిగ్‌బాస్‌-4 గతేడాది డిసెంబర్‌ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా నాల్గోవ సీజన్‌ ముగిసి నెల రోజులు గడిచిందో లేదో.. అప్పుడు బిగ్‌బాస్‌-5 సీజన్‌పై టాక్‌ మొదలైంది.

స్టార్ మా కూడా ఐదో సీజన్‌ కోసం ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ‘బిగ్‌బాస్‌’ కు సంబంధించిన పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐదో సీజన్‌ తొలి కంటెస్టెంట్‌ ఇతనే అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ నటుడు షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఆయనకు యూత్‌లో ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Bigg boss 5 telugu first co 1

షణ్ముఖ్‌ తీసిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ షార్ట్‌ఫిలిమ్ మంచి విజయం సాందించింది. ఓ పెద్ద సినిమా తీసిన రాని పేరును ఒక షార్ట్‌ఫిలిమ్‌తో సంపాదించాడు షణ్ముఖ్‌. ఈ సూప‌ర్ సిరీస్‌తో షణ్ముఖ్‌ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజీయే ఇప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి సెలెక్ట్‌ అయ్యేలా చేసిందని వినికిడి‌. యాంక‌ర్ ర‌వి, క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది పేర్లను నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu