బిగ్‌బాస్‌: మోనాల్‌కు షాక్‌ ఇచ్చిన అఖిల్‌


తెలుగు బిగ్‌బాస్‌-4లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ప్రొమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్‌ కాస్త వాడి వేడిగానే కనిపిస్తోంది. నామినేషన్స్‌లో భాగంగా ఇద్దరు సభ్యుల్లో ఒకరు నామినేట్‌ అవ్వాలి. ఆ ఇద్దరు సభ్యులు చర్చించుకుని ఎందుకు సేవ్‌, నామినేట్‌ కావాలి అనుకుంటున్నారో వివరిస్తున్నారు. మోనాల్‌-అఖిల్‌ ఓ జట్టు కాగా అఖిల్‌ తనను తాను సేవ్‌ చేసుకుంటాను అని చెప్పడంతో మోనాల్‌ షాక్‌ అయింది. మెహబూబ్‌-అరియానా, అభిజిత్-హారిక. సోహైల్‌-అవినాష్‌ జంటలుగా కనిపిస్తున్నారు. ఎవరు నామినేట్‌ అవుతారు. ఎవరు సేవ్‌ అవుతారు. ఇంకా ఇంట్లో ఏమి జరుగుతుందో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ఇది ఇలా ఉంటే నిన్న ఆదివారం కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అవ్వడంపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. బిగ్‌బాస్‌పై నెటిజన్లు మండి పడుతున్నారు. మోనాల్‌ కంటే కుమార్‌ సాయికి ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలనే ఎలిమినేట్‌ చేశారని నెటిజన్లు అంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ మమ్మల్ని ఓట్లేయమని అడగడం ఎందుకు అని బిగ్‌బాస్‌ నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం నిజాయితీగా ఆట ఆడేవాళ్లను ఎలిమినేట్ చేస్తారా? ఇక బిగ్ బాస్ షో చూడం.. హాట్ స్టార్ యాప్‌తో పాటు స్టార్ మా ఛానల్‌ను అన్ లైక్ చేస్తాం. అలాగే యూట్యూబ్‌లో బిగ్ బాస్ ప్రోమోకి డిస్ లైక్‌లు కొట్టి మా సత్తా చూపిస్తాం.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

CLICK HERE!! For the aha Latest Updates