HomeTelugu Big Stories'బిగ్‌బాస్‌-5' గ్రాండ్‌ ఫినాలే అతిథులుగా బాలీవుడ్‌ స్టార్స్‌?

‘బిగ్‌బాస్‌-5’ గ్రాండ్‌ ఫినాలే అతిథులుగా బాలీవుడ్‌ స్టార్స్‌?

Telugu Bigg boss 5 season g

తెలుగు బిగ్‌బాస్‌- 5 సీజన్‌ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ రోజే విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. డిసెంబర్ 19న జరిగే ఈ ఫైనల్‌కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ఉంది కంటెస్టెంట్ల మధ్య పోటీ. ఇన్నివారాలు మేము పోరాడాం, ఇప్పుడు మా కోసం మీరు పోరాడండి అంటూ తమకు ఓట్లేసి గెలిపించే భారాన్ని ప్రేక్షకులపై వేశారు ఫైనలిస్టులు.

Bigg boss 5 1

డిసెంబర్‌ 19న జరగనున్న గ్రాండ్‌ ఫినాలేను ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. మొదట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ముఖ్య అతిథులుగా వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ టాలీవుడ్‌ కాకుండా ఏకంగా బాలీవుడ్‌ నుంచి సెలబ్రిటీలను పట్టుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట బిగ్‌బాస్‌ నిర్వాహకులు. స్టార్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలతో పాటు బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ అలియా భట్‌ను సైతం గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథులుగా తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారట.

Bigg boss 5 2

అలాగే టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ సైతం షోలో సందడి చేయనున్నాడట! ఇదే నిజమైతే స్క్రీన్‌పై ఇంతమంది సెలబ్రిటీలను ఒకేసారి చూడటం ప్రేక్షకులకు కనులవిందు అనే చెప్పాలి! మరి గ్రాండ్‌ ఫినాలేకు ఈ నలుగురే ఫిక్స్‌ అయ్యారా? లేదంటే ఈ సీజన్‌ విజేతకు ట్రోఫీ అందించేందుకు మరెవరైనా సెలబ్రిటీ వస్తారా? అన్నది చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu