HomeTelugu Trendingబిగ్‌బాస్‌-5: స్టేజ్‌పై రాజమౌళి -బ్రహ్మాస్త్ర టీమ్‌ సందడి

బిగ్‌బాస్‌-5: స్టేజ్‌పై రాజమౌళి -బ్రహ్మాస్త్ర టీమ్‌ సందడి

 

Bigg Boss final

బిగ్‌బాస్‌-5 హౌస్‌లో ఉన్న టాప్‌-5 కంటెస్టెంట్స్‌ స్పెషల్‌ సాంగ్స్‌తో అదరగొట్టారు. 13 కోట్ల ఓట్లు వచ్చినట్లు ఇంటి సభ్యులకు తెలియజేశారు నాగార్జున. 105 రోజుల బిగ్‌బాస్‌ జర్నీ చూపించారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ జర్నీ ఆకట్టుకుంది. తరువాత టాప్‌-5 కంటెస్టెంట్స్‌.. హౌస్‌లో ఉన్న వారి ఫెవరెట్‌ స్పార్ట్‌లో హార్ట్‌ పెట్టారు. స్టేజ్‌పై స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమా RRR గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. బ్రహ్మాస్త్ర సినిమాని రాజమౌళి ప్రజెంట్‌ చేస్తున్నట్లు నాగార్జున తేలియజేశారు. ఈ సినిమాపై రాజమౌళి తన అభిప్రాయం తెలియజేశారు. బ్రహ్మాస్త్ర టీమ్‌ని స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ముందుగా నాగార్జునను పరిచయం చేస్తూ.. బాలీవుడ్‌ నటుడుని చూస్తున్నట్లే ఉంది అన్నారు. తరువాత స్టేజ్‌పైకి డైరెక్టర్‌ ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి కాళ్ళకు మొక్కాడు డైరెక్టర్‌. తరువాత అలియా, రణ్‌బీర్‌లు ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మాస్త్ర ప్రోమో చూపించారు.

అలియా భట్‌, రణ్‌బీర్‌తో నాగార్జున తెలుగుతో మాట్లాడించాడు. ఇక ఇంటి సభ్యులతో బ్రహ్మాస్త్రం అనే గేమ్‌ ఆడిపించారు. అలియాను చూడగానే సన్నీ ఎగ్జైట్ అయ్యాడు. తరువాత హౌస్‌మేట్స్‌ని బ్రహ్మాస్త్ర టీమ్‌కి పరిచయం చేశారు. సన్నీ అలియాతో బాలయ్య డైలాగ్‌ దబిడి దిబిడే అనే డైలాగ్‌ చెప్పించాడు. బ్రహ్మాస్త్రం చేతిలోకి తీసుకొని వారిలో ఉన్న అల్టిమేట్‌ పవర్‌ తేలియజేశారు హౌస్‌మేట్స్‌. సుబాన్‌ అలా సాంగ్‌ పాడి అలియాకు డెడికేట్‌ చేశాడు శ్రీరామ్‌ చంద్ర. మానస్ చెప్పిన సమాధానం రాజమౌళికి నచ్చింది. బ్రహ్మాస్త్రం మానస్‌కు ఇచ్చారు. సన్నీ ఆర్‌ఆర్‌ఆర్‌ మిస్‌ అవుతున్నాం అనగానే.. రిలీజ్‌ అయిపోయింది అని షాక్‌ ఇచ్చాడు రాజమౌళి. తరువాత లేదు.. మీరు వచ్చేసరికి రెడీ చేస్తున్నాం అని తెలిజేశాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu