బిగ్‌బాస్‌: నాగర్జునకు హైకోర్టు నోటీసులు

బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హోస్ట్‌ నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదని… ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ ఇటీవలే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటషన్ పై ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ జరగగా.. తాజాగా గురువారం జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీజులు జారీ అయ్యాయి. రెండు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోర్టు… నాగార్జునతో పాటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates