HomeTelugu Big Storiesసోహైల్‌కు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం బంపర్‌ ఆఫర్‌

సోహైల్‌కు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం బంపర్‌ ఆఫర్‌

Brahmanandam bumper offer f
తెలుగు బిగ్‌బాస్‌-4 మొన్నటి ఆదివారంతో ముగిసింది. సీజన్‌-4 విన్నర్‌గా అభిజిత్‌ నిలిచినా… అంతకు మించి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు సోహైల్‌. సెకండ్‌ రన్నరఫ్‌గా నిలిచినా.. విన్నర్‌ సాధించినంత ఫ్రైజ్‌ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్‌ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. అందులో నుంచి రూ.10 లక్షలు అనాథశ్రయాలకు ఇస్తానంటే.. వద్దని, ఆమొత్తాన్ని నేనే ఇస్తానని నాగార్జున్‌ చెప్పాడు. ఐదు లక్షలు మిత్రుడు మెహబూబ్‌కి ఇస్తానంటే.. వద్దొద్దు.. నేనే మెహబూబ్‌కి పది లక్షలు ఇస్తానని షోకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి చెప్పాడు. దీంతో సోహైల్‌కు మంచి పేరు రావడంతో పాటు రూ.25లక్షలు దక్కాయి. అంతే కాకుండా తను తీయబోయే సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేస్తానని మెగాస్టార్‌ చిరంజీవి ఆఫర్‌ ఇవ్వడంతో సోహైల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తాజాగా సోహైల్‌ను మరో బంపర్‌ ఆఫర్‌ వరించింది. టాలీవుడ్ స్టార్‌ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపాడట. ఈ విషయాన్ని సోహైలే స్వయంగా వెల్లడించాడు. ‘బ్రహ్మనందం ఫోన్‌ చేసి.. సోహైల్ నీ కోసమే బిగ్‌బాస్‌ చూశా అన్ని అన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తానని చెప్పారు. అలాగే నేను తీయబోయే సినిమాలో ఫ్రీగా నటిస్తానని హామీ ఇచ్చారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి’ అని సోహైల్‌ చెప్పుకొచ్చాడు ఓ వైపు చిరంజీవి, నాగార్జున అండ, మరోవైపు బ్రహ్మానందం వంటి స్టార్ కమెడీయన్ కూడా సోహైల్‌ కు తోడుగా తన సినిమాలో నటిస్తాననడం సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. త్వరలోనే సోహైల్‌ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన వద్దకు పలువురు ఫిల్మ్ మేకర్స్ క్యూ కడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!