బిగ్‌బాస్‌: అలా.. ఆ ఇద్దరూ.. ఆ రూమ్‌లో

ప్రేక్షకుల అంచనాల మధ్య బిగ్‌బాస్‌-4 నిన్న ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో 16 మంది సభ్యులు పాల్గొంటున్నారు. ఇక ఇందులోని ఇద్దరు కంటెస్టెంట్స్‌ని మాత్రం బిగ్‌బాస్‌ స్పెషల్‌ రూమ్‌లోకి పంపించాడు. ‘సయ్యద్ సోహైల్’ అరియానా గ్లోరీ (యాంకర్‌)ని స్పెషల్‌ రూమ్‌లోకి పంపించాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే వీరు తమని ఓ రేంజ్‌లో పరిచయం చేసుకున్నారు. అరియానా గ్లోరీ నేను బోల్డ్‌ అని చెప్పింది.

ఇక సయ్యద్‌ సోహైల్‌.. కొత్త బంగారులోకం సినిమాతో వెండితెర‌పై న‌టుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ త‌ర్వాత త‌న‌కు మంచి బ్రేక్ అనేదే రాలేదు. స‌య్య‌ద్‌ అటు సినిమాల‌తోపాటు ప‌లు సీరియ‌ల్స్‌లోనూ న‌టిస్తున్నాడు. అయితే గ‌తేడాదిగా బిగ్‌బాస్ కోసం ఏ ప్రాజెక్టును ఒప్పుకోలేదని స్టేజ్‌పై వెల్ల‌డించాడు. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు రావాలంటే అది బిగ్‌బాస్ మాత్ర‌మేన‌ని బ‌లంగా న‌మ్మాన‌ని చెప్పుకొచ్చాడు. ఎట్ట‌కేల‌కు బిగ్‌బాస్‌కు రావాల‌న్న క‌ల నెర‌వేరింద‌ని సంతోషించాడు. అత‌డిని అంద‌రూ ‘ఇస్మార్ట్ సోహైల్’ అని పిలుస్తార‌ని చెప్పాడు. కాగా ఈ ఇస్మార్ట్‌ సోహైల్‌, బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీని ఓ రూమ్‌లోకి పంపారు. తాజాగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో సోహైల్ వీపు మీద ఎక్కి కూర్చుని రచ్చను షురూ చేసింది అరియానా.

CLICK HERE!! For the aha Latest Updates