HomeTelugu Big Storiesమోడీపై బిగ్‌బాస్‌ బ్యూటీ ట్వీట్‌.. కేసు నమోదు

మోడీపై బిగ్‌బాస్‌ బ్యూటీ ట్వీట్‌.. కేసు నమోదు

Bigg Boss fame Oviya tweets
ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ ఓవియా హెలెన్ ఓ ట్వీట్ చేశారు. దీంతో.. ఆమెపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ యువ నటి ఓవియా ఓ ట్వీట్ చేశారు. #GoBackModi అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై తమిళ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవియా చేసిన ట్వీట్‌పై సైబర్ సెల్ సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కోరినట్టు సమాచారం. ఈ ట్వీట్‌పై బీజేపీ తమిళనాడు సెక్రెటరీ మాట్లాడుతూ.. ఓవియా ట్విట్ వెనుక చైనా శ్రీలంక దేశాలకు చెందిన కొందరు ఉండవచ్చనే సందేహం వ్యక్తం చేశారు.

దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకు ఓవియా లాంటి సెలబ్రిటీలను ఉపయోగించుకొంటున్నారని ఆరోపించారు. కాగా.. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు సోషల్ మీడియా హెడ్ నిర్మల్ కుమార్ మాత్రం ఓవియాపై కేసు వార్తలను ఖండించారు. తమిళనాడులోని ఏ సెలబ్రిటీపై కూడా బీజేపీ నేతలు ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆమె టాలీవుడ్‌లో ‘ఇది నా లవ్ స్టోరి’ సినిమాలో నటించింది. తమిళంలో 90ml ముని-4 కాంచన-3 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజా భీమ బ్లాక్ కాఫీ వంటి సినిమాలు చేస్తోంది ఓవియా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!