HomeTelugu Trendingబాలయ్య సినిమాలో బిగ్ బాస్ విన్నర్‌కి బంపరాఫర్

బాలయ్య సినిమాలో బిగ్ బాస్ విన్నర్‌కి బంపరాఫర్

Bindu Madhavi COVID

ఇటీవల జరిగిన బిగ్‌బాస్ నాన్ స్టాప్ లో విజేతగా నిలిచింది బిందు మాధవి. గతంలో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసి అవకాశాలు లేకపోవడంతో కొన్ని రోజుల నుంచి సినిమాలకి దూరంగా ఉన్న బిందు మాధవి బిగ్‌బాస్ లో పాల్గొని తెలుగు బిగ్‌బాస్ లో మొదటి మహిళా విజేతగా నిలిచింది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. F3 మూవీ విడుదల తరువాత బాలయ్య బాబుతో సినిమా ఉందని చెప్పారు. దీంతో హోస్ట్ నాగార్జున.. మరి ఆ సినిమాలో బిందు మాధవికి రోల్ ఉందా..? అని అడిగారు … కచ్చితంగా బాలయ్య బాబు సినిమాలో బిందు మాధవికి ఒక క్యారెక్టర్ ఇస్తాను అని అనిల్ రావిపూడి స్టేజి మీదే చెప్పాడు

ఇక గత సీజన్‌లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్‌గా వెళ్లిన మెగాస్టార్.. బ్యూటీ కంటెస్టెంట్ దివికి తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి గెస్ట్‌గా వెళ్లిన అనిల్ రావిపూడి బిందు మాధవికి ఛాన్స్ ఇచ్చారు.ఈ విషయంపై బిందు మాధవి తండ్రి స్పందించారు. అనిల్ రావిపూడి సినిమాలో అవకాశం రావడంతో బిందుమాధవి చాలా హ్యాపీగా ఫీలైందని చెప్పారు. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో బిందుకు మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటున్నానని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!