Bigg Boss Telugu 8 Wild Card Entry:
బిగ్ బాస్ 8 తెలుగు మొదటి వారం పూర్తయ్యింది. సోషల్ మీడియా ఫేమ్ బేబక్క షో నుంచి బయటకు వెళ్లిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది. బేబక్క ఇంట్లో పెద్దగా హడావుడి సృష్టించకపోవడం వల్ల ఈ ఎలిమినేషన్ ఊహించినదే అని అందరూ భావిస్తున్నారు.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, బేబక్క స్థానంలో కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగనుంది. ప్రముఖ సెలబ్రిటీ ఒకరు నేడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు అని షో టీమ్ నుంచి సమాచారం అందింది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు జ్యోతి రాయ్ అని టాక్ నడుస్తోంది.
ప్రముఖ తెలుగు టెలివిజన్ నటి జ్యోతి రాయ్ బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ Bigg Boss Telugu 8 లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.
తాజా సమాచారం ప్రకారం సీజన్ ప్రారంభంలోనే బిగ్ బాస్ టీమ్ ఆమెను సంప్రదించింది కానీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆమె పాల్గొనలేకపోయిందట. కానీ ఇప్పుడు ఆమె ఫ్రీ అవ్వడంతో షోలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
జ్యోతి రాయ్ తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది. ప్రతిరోజు గడుస్తున్న కొద్దీ షో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ తో ఇంటి సభ్యుల మధ్య గొడవలు, తగాదాలు మరింత ఎక్కువవుతాయని చెప్పుకోవచ్చు.