HomeTelugu Big Storiesకంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేసిన బీఎంసీ

కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేసిన బీఎంసీ

BMC staff demolishing kanga
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. ‘నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్’ అంటూ మరోసారి ట్విట్టర్ లో కామెంట్ చేసింది. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది.

తాను ఎలాంటి తప్పు చేయలేదని… కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్ని తన శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘బాబర్, అతని సైన్యం’ అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. సుశాంత్ మరణం తర్వాత శివసేన నేతలకు, కంగనకు మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కంగన కార్యాలయాన్ని కూల్చివేశారు.

ఈ క్రమంలో కూల్చివేతపై స్టే విధించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది కంగనా రనౌత్. తన నివాసం వద్ద ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని, అంతేగాక కోవిడ్ సమయంలో ఎలాంటి కూల్చివేతలు చేయకూడద్దన్న కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషన్‌ వేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కూల్చివేతపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కంగనా పిటిషన్‌పై సమాధానం చెప్పాలని బీఎంసీని ఆదేశించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu