HomeTelugu Trendingసంపత్‌ నందితో ఊర్వశి రౌతేల మూవీ

సంపత్‌ నందితో ఊర్వశి రౌతేల మూవీ

Bollywood Actress urvashi r
శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం 4గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మోహన్ భరద్వాజ్ డైరెక్షన్‌లో వస్తుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను చిత్రయూనిట్ తెలియజేసింది.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘‘మేము నిర్మిస్తున్న ‘బ్లాక్ రోజ్’ చిత్ర యూనిట్‌కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆగస్ట్ 17 నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నాము. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా ‘బ్లాక్ రోజ్’ కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. కోవిడ్ టైమ్‌లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది. చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాము’’ అన్నారు.

ఈ చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంపత్ నంది మాట్లాడుతూ.. ‘‘షేక్స్‌స్పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘బ్లాక్ రోజ్’ తెరకెక్కుతోంది. ‘విచక్షణలేని, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్‌ను జోడిస్తూ ‘బ్లాక్ రోజ్’ను నిర్మిస్తున్నాం..’’ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu