మరోసారి ‘మహేష్‌బాబు’ సరసన కైరా


టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. మహేష్‌ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్‌ హీరోయిన్‌ కైరా అద్వాణీ. ఈ సినిమాలో మహేష్‌ జంట’వసుమతి’ పాత్రలో నటించిన కైరా ప్రేక్షకులను మెప్పించారు. దీంతో ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్‌ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేయనున్నారంటూ టాలీవుడ్‌లో వినికిడి‌. ఈ సినిమాలో మహేష్‌కు జంటగా కైరా అడ్వాణీ అయితే బాగుంటుందని నమ్రత దర్శకుడికి సూచించారట. నమ్రత మాట ప్రకారం వంశీ సైతం కైరానే హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

CLICK HERE!! For the aha Latest Updates