బాలీవుడ్‌లో మరో ప్రయోగాత్మక సినిమా

బదాయి హో, పాడ్ మాన్, అంధాధున్ వంటి సినిమాలతో ప్రయోగాలు చేసిన బాలీవుడ్‌ తాజాగా బట్టతలపై సినిమా తీయబోతున్నారు. ఇప్పటి వరకు ప్రయోగాత్మక సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాలు. వినూత్నంగా అలోచించి తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయగలితే చాలు అనుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. సినిమాల్లో హీరో అంటే స్టైలిష్ గా ఉండాలి.. హ్యాండ్ సమ్ లుక్ తో కనిపించాలి. హీరో ఎంత పేదవాడైనా సరే కోటు బూటు వేసుకోవాలి.. ఒకపుడు ఇలా ఆలోచించేవారు. రియాలిటీకి దూరంగా సినిమాలు ఉండేవి. కానీ, ఇప్పుడు రియాలిటీ దగ్గరగా అంటే.. రియల్ గా ఎలా ఉంటున్నారో అలాగే సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు.

సూపర్ 30 సినిమాలో హృతిక్ రోషన్ చినిగిపోయిన, మాసిపోయిన తలతో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా కూడా బట్టతలతో కనిపించబోతున్నాడు. అన్ని రకాలుగా సినిమాలు చేస్తున్నారుగాని, బట్టతలను ఇతివృత్తంగా తీసుకొని ఎందుకు సినిమాలు చేయడం లేదని అనుకున్నారేమో. ఆ దిశగా ఆలోచించి కథను తయారు చేసుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా బట్టతల కలిగిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. బట్టతలపై బాలీవుడ్లో రెండు సినిమాలు రాబోతున్నాయి. బట్టతల కలిగిన వ్యక్తులు పడే బాధలను సినిమాలో చూపించబోతున్నారట.