శంకర్ మూవీలో బాలీవుడ్‌ స్టార్ హీరో!

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ తీయాలనుకుంటున్నాడట ఆయన. ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అయితే బాగుంటుందని శంకర్ భావిస్తున్నాడట. మరి ‘రోబో, 2.0’ లాంటి ఫిక్షన్ సినిమాల్ని రూపొందించి అబ్బురపరిచిన శంకర్ ఈసారి ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి.