చిరు కొత్త లుక్ చూశారా..?

మెగాస్టార్ చిరంజీవి పది సంత్సరాల విరామం తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. దీంతో చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం పూర్తిగా సన్నద్ధం అయ్యారు. సురేందర్ రెడ్డితో బ్రిటీష్ పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించబోతున్నారు.  సైరా చిత్ర యూనిట్ డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది.  

చిరు సైరా మూవీ కోసం మేకోవర్‌పై శ్ర‌ద్ధ పెట్టారు.  ఇందుకోసం చిరంజీవి పూర్తిగా సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.  ప్రతిరోజు జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతూ చాలా వరకు సన్నబడ్డారు. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటో మీకోసం