‘దేవదాస్’ను సొంతం చేసుకున్న భారీ సంస్థ

అక్కినేని నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్’. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నెల 27న విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల హక్కులని ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వయకామ్ 18 దక్కించుకుంది.

గతంలో ‘భాగ్ మిల్కా భాగ్, పద్మావత్’ వంటి సినిమాల్ని విడుదలచేసిన ఈ సంస్థకు తెలుగులో ఇదే మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున డాన్‌ పాత్రలో, నాని డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. జయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.