HomeTelugu Trendingతమిళ హీరో విక్రమ్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్‌

తమిళ హీరో విక్రమ్‌ ఇంటికి బాంబు బెదిరింపు కాల్‌

Bomb threat to Hero Vikram
కోలీవుడ్‌ స్టార్‌ హీరో ఇళ్ల‌ల్లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్స్ రావ‌డం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ‌య్యాయి. అలాంటి వారికి పోలీసులు ఎంత బుద్ధి చెప్పినా వారు తీరు మార్చుకోవ‌డం లేదు. తాజాగా ప్ర‌ముఖ నటుడు చియాన్ విక్ర‌మ్ నివాసానికి బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. సోమ‌వారం నాడు ఓ ఆగంత‌కుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెన్నైలోని హీరో విక్ర‌మ్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు బెదిరించారు. దీంతో పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌తో స‌హా హుటాహుటిన‌ ఆయ‌న ఇంటికి చేరుకుని సోదాలు నిర్వ‌హించారు. అనంతరం ఆన‌వాళ్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఎవ‌రో ఆగంత‌కుడు బెదిరింపు కాల్స్ చేసిన‌ట్లు ధృవీకరించారు. అత‌డు విల్లాపురం నుంచి కాల్ చేసినట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం పోలీసులు అత‌డిని ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!