‘గబ్బర్ సింగ్3’ ప్లానింగ్ లో హరీష్ శంకర్!

హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో.. అందరికీ తెలిసిందే.. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన హిట్ సినిమా గబ్బర్ సింగ్ తో దక్కింది. రీమేక్ సినిమా అయినప్పటికీ హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో మార్పులు చేసి సినిమాను హిట్ చేశాడు.

అయితే ఇటీవల దానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా కూడా హరీష్ డైరెక్ట్ చేస్తే బావుండేదని పవన్ అభిమానులు అనుకోని క్షణం ఉండదు. ఆ ప్రాజెక్ట్ బాబీ చేతుల్లోకి వెళ్ళడం.. సినిమా ఫ్లాప్ అవ్వడంతో అభిమానులు నిరాశ చెందారు. పవన్ సైతం ఇకపై అటువంటి సినిమాల్లో నటించడానికి సాహసిస్తాడో.. లేదో.. చెప్పలేని పరిస్థితి.

కానీ దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్ 3’ సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేస్తోన్న హరీష్ శంకర్ పోలీస్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని ఓ కథను సిద్ధం చేశాడట. ఆ కథ పవన్ కు బాగా సూట్ అవుతుందని హరీష్ నమ్మకం. మరి హరీష్ తో సినిమా చేయడానికి పవన్ అంగీకరిస్తాడో.. లేదో.. చూడాలి!