Bigg Boss 8 Telugu Elimination:
Bigg Boss 8 Telugu ప్రస్తుతం డ్రామా, ఫైట్లు, వినోదంతో ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ఉన్న ఈ షోలో ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు, శేఖర్ బాషా, బేజవాడ బేబక్క, ఇంటి నుండి బయటకు వెళ్లారు. మూడో వారం చేరుకున్న కొద్దీ ఎలిమినేషన్ పై ఉత్కంఠ పెరుగుతోంది.
ఈ వారం ఎలిమినేషన్‌కు ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన కంటెస్టెంట్లు: యష్మి గౌడ, ప్రేరణ, సీతా, విష్ణుప్రియ, నైనికా, నాగ మణికంఠ, పృథ్విరాజ్, అభయ్ నవీన్. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక పోల్స్‌లో ఇద్దరు మాత్రమే తక్కువ ఓట్లు పొందుతున్నారు.
వీరిద్దరు ఎలిమినేషన్‌కు చేరువగా ఉన్నారని అంచనాలు ఉన్నాయి. వాళ్లే పృథ్విరాజ్, అభయ్ నవీన్. అయితే యష్మి గౌడ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉండవచ్చని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.
Read More: Bigg Boss 8 Telugu హౌస్ లో రెండు వారాలకి శేఖర్ భాషా ఎంత సంపాదించారో తెలుసా?
డేంజర్ లో ఉన్న ఇద్దరితో పోలిస్తే.. యష్మి కి బలమైన మద్దతు ఉంది. అయినప్పటికీ, బిగ్ బాస్‌లో ఎప్పుడూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. చివరి క్షణాల్లో ఎలిమినేషన్ ఫలితాలు ఏమి వస్తాయో తెలియదు.
గతవారం కూడా శేఖర్ భాష ఎలిమినేషన్ అలాగే ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది. ఇక ఈ వారం సర్ప్రైజ్ ఎలిమినేషన్ కి యష్మీ వెళ్ళిపోతే బాగుంటుంది అని బయట టాక్ ఉంది. మిగతా ఇంటి సభ్యులతో పోలిస్తే ఆమె మీద నెగటివిటీ చాలా ఎక్కువగా ఉంది. పృథ్విరాజ్, అభయ్ నవీన్ కాకుండా యష్మి వెళ్లే ఛాన్స్ ఉందో లేదో చూడాలి.