135 కోట్ల మంది ప్రేమ పొందడమే నాకు గొప్ప అవార్డు: సోనూసూద్‌

కరోనా సమయంలో రియల్‌ హీరోగా మారిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. ఈ ఏడాది ‘పద్మవిభూషణ్‌’ అవార్డును సోనూసూద్‌కు ఇవ్వాలని కోరుతూ టాలీవుడ్‌ నటుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్‌ పెట్టారు. గత కొంతకాలంగా సోనూ చేస్తున్న నిర్విరామ సేవలను గుర్తించి ఈ అవార్డుతో గౌరవించాలని అభిప్రాయపడ్డారు. బ్రహ్మాజీ పెట్టిన ట్వీట్‌పై సోనూ స్పందిస్తూ.. ‘బ్రదర్‌.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమను పొందడమే గొప్ప అవార్డు. ఇప్పటికే నేను ఆ అవార్డును పొందాను’ అని సమాదానం ఇచ్చారు.

సినిమాల్లో విలన్‌గా నటించే సోనూసూద్‌ కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచాడు. కరోనా తొలి విడతలోవలస కూలీల కోసం ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసిన సోనూసూద్‌.. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను సరఫరా చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తనని సాయం కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన ఆపన్నహస్తం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates