HomeTelugu Trendingవెబ్‌ సిరీస్‌లో నిత్యామీనన్‌..

వెబ్‌ సిరీస్‌లో నిత్యామీనన్‌..

4 11టాలీవుడ్‌లో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిత్యా మీనన్. ఇన్నాళ్లూ వెండితెరపై అలరించిన ఈ బొద్దుగుర్మ ఇప్పుడు డిజిటల్‌లోనూ కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ఆమె నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌ మొదటి సీజన్‌ ఇప్పటికే విడుదలైంది. ఇప్పుడు రెండో సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు అభిషేక్‌. ‘తను నీడలో ఉంటూ.. కావాల్సిన దాని కోసం ఎదురుచూస్తోంది. ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌” అని పోస్ట్‌ చేశారు. జులై 10న ఈ సీజన్‌ ప్రారంభం కాబోతోంది. ఇందులో అమిత్‌ సాద్‌, సయామీ ఖేర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నిత్యామేనన్‌ మొదటిసారి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. మొదటి సీజన్‌ను తీసిన మయాంక్‌ శర్మ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ‘బ్రీత్‌’ సీజన్‌ 1ను సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఓ సాధారణ వ్యక్తి అసాధారణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం చుట్టూ సాగే కథ అది. ఆర్‌. మాధవన్‌ నటించిన ఆ సిరీస్‌ అందర్నీ ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu