HomeTelugu Trending'బుచ్చినాయుడు కండ్రిగ' మూవీ ట్రైలర్

‘బుచ్చినాయుడు కండ్రిగ’ మూవీ ట్రైలర్

Buchhinaidu kandriga movi
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. అందుకే సినిమాలకు ఓటీటీలే మార్గంలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విడుదల అయ్యాయి. తాజాగా ఆహాలో విడుదల కాబోతున్న సినిమా ‘బుచ్చినాయుడు కండ్రిగ, తూర్పు వీధి’. ఈ చిత్రానికి కృష్ణ పొలూరు దర్శకత్వం వహిస్తున్నారు. మున్నా, దృశిక చందర్ హీరో, హీరోయిన్లు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను హీరోయిన్ రకుల్ ప్రీత్ చేతుల మీదుగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్ర‌తీ క‌థ మ‌నిషి పుట్టుకతో మొద‌ల‌వుతుంది.. కానీ నా క‌థ నా చావుతో మొద‌లైంది అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. గ్రామీణ నేపథ్యం, ప్రేమ కథా చిత్రం అనిపిస్తోంది. ఈ చిత్రంలో ర‌విశ‌ర్మ‌, ప్ర‌భావ‌తి, సుబ్బారావు, ప్ర‌భావ‌తి, ప‌విత్ర జ‌య‌రాయ్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై పమిడిముక్కల చంద్రకుమారి నిర్మించారు. ఈనెల 21న ఈ చిత్రాన్ని ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu