20 ఏళ్ళ కెరీర్.. బన్నీ ట్వీట్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సారాలు అవుతుందట. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామ లింగయ్య మనవడిగా.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా ఇడస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా ఎదిగాడు. 1985లో వచ్చిన ‘విజేత’ సినిమా ద్వారా బాల నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన ఆయన 2003లో గంగోత్రి సినిమాలో హీరోగా నటించాడు.

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నేటికి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా.. బన్నీ ట్వీట్‌ చేశాడు. ప్రేక్షకుల ఆదరాభిమానాలు ప్రేమ వల్లే తాను ఈ స్థితికి చేరుకున్నట్లు తెలిపాడు. ప్రేక్షకులతో పాటు తన ఫ్యాన్స్‌, ఇండస్ట్రీకి చెందిన తన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులోనూ తనను ఆదరించాలని కోరాడు.

ఈ ట్వీట్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కంగ్రాట్స్ అంటూ కొందరు చెబుతుండగా.. చాలా ఏళ్ల పాటు మీరు ఇలాగే స్టార్ హీరోగా కొనసాగుతారని కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ కి హాట్స్ ఆఫ్ అని చెబుతున్నారు. ప్రస్తుతం అ్లలు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates