‘పడి పడి లేచె మనసు’పై బన్నీ ట్వీట్‌

శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సోమవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్‌ విచ్చేశారు. తనను వేడుకకు ఆహ్వానించినందుకు చిత్రబృందానికి ధన్యవాదాలు చెబుతూ బన్నీ ట్వీట్‌ చేశారు.

‘పడి పడి లేచె మనసు ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరయ్యాను. నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. శర్వానంద్‌, సాయి పల్లవి, హను రాఘవపూడి, ఇతర సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ శుక్రవారం మీ సినిమా మనసులు దోచుకుంటుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా బన్నీ ప్రస్తుతం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటించబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.