‘బుర్రకథ’ న్యూ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

యువ నటుడు ఆది సాయికుమార్‌, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘బుర్రకథ’. ఈ సినిమాతో ప్రముఖ రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈసినిమా వాయిదా పడటంతో జూలై 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.

సెన్సార్‌ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో శుక్రవారం విడుదల కావాల్సిన బుర్రకథ వాయిదా పడింది. శనివారం రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినా కుదరకపోవటంతో వారం ఆలస్యంగా జూలై 5న సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు ‌. దిని సంబంధించి కొత్త రిలీజ్‌ డేట్‌తో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.